టీమ్‌ ఇండియాలో విశ్వాసం పెంచాలి

టీమ్‌ ఇండియాలో విశ్వాసం పెంచాలి

న్యూఢిల్లీ: ‘మేం తెగించి ఆడలేకపోయాం’ అని కివీస్‌ చేతిలో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన ఈ స్టేట్‌మెంట్‌ చాలా బలహీనంగా ఉందని కపిల్ దేవ్‌ అన్నాడు. ఈ క్లిష్ట సమయంలో టీమ్‌లో విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉందన్నాడు. ఈ పనిని హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, మెంటార్‌ ధోనీ చేయాలన్నాడు. ‘జట్టు కోసం కోహ్లీ చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. ఆ కోరిక, ప్యాషన్‌ తనలో ఇప్పటికీ ఉన్నాయి. కానీ కివీస్‌తో మ్యాచ్‌ తర్వాత ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్‌, కోహ్లీ వ్యాఖ్యలు అలా ఉండటం కఠినంగా అనిపిస్తున్నది. ఈ టైమ్‌లో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్లేయర్ల విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నా స్నేహితుడు శాస్త్రి, ధోనీని కోరుతున్నా’ అని చెప్పాడు.