ముందు ఇల్లు కట్టుకోండి.. బిల్లు తర్వాత ఇస్తం : స్పెషల్ ఆఫీసర్

ముందు ఇల్లు కట్టుకోండి.. బిల్లు తర్వాత ఇస్తం : స్పెషల్ ఆఫీసర్

‘డబుల్ ఇండ్ల’ లబ్ధిదారులకు సూచించిన స్పెషల్ ఆఫీసర్

మొగులపల్లి, వెలుగు: లబ్ధిదారులు ముందు డబుల్​బెడ్​రూం ఇల్లు కట్టుకుంటే తర్వాత సర్కారు బిల్లులు చెల్లిస్తుందని స్పెషల్ ​ఆఫీసర్​ చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలో బుధవారం డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులతో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమీక్షించారు. లబ్ధిదారులు మాట్లాడుతూ 50 ఇండ్లు మంజూరై ఐదేండ్లవుతోందని, ఇప్పటికీ 25 ఇండ్లకే స్లాబులు పడ్డాయని చెప్పారు. జరిగిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్​ ఉంటే ఇప్పిస్తామని మండల స్పెషల్ ఆఫీసర్ సునీత చెప్పారు. ముందు సొంత డబ్బులతో  కట్టుకోవాలని, తర్వాత ప్రభుత్వం ఇస్తుందన్నారు. 

మార్చికల్లా ఇండ్లన్నీ కంప్లీట్ చేసుకోవాలని సూచించారు. మూడేళ్ల క్రితమే తాము ఒక్కొక్కరు రూ. 50 వేల వరకు ఇంటి పనులకు ఖర్చు పెట్టామని, ఇప్పటికీ ఆ డబ్బులు ఇవ్వలేదని లబ్ధిదారులు అన్నారు. తమ దగ్గర పైసలు లేవని, మీరే కట్టించాలని ఆఫీసర్లను కోరారు. గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీరాజ్ ఆఫీసర్ నిర్లక్ష్యం వల్ల పనులు స్లోగా జరిగాయని ప్రజాప్రతినిధులు స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం డబుల్ బెడ్ రూం ఇండ్లను, జీపీ బిల్డింగ్ పనులను  పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సదయ్య, ఎంపీడీవో కృష్ణవేణి, పీఆర్ ఏఈ రమేశ్, స్థానిక సర్పంచ్​బెల్లంకొండ మాధవి శ్యాంసుందర్ రెడ్డి   పాల్గొన్నారు.