బెంగళూర్ ఓ ట్రక్ డ్రైవర్ వ్యక్తి ప్రాణాన్ని రక్షించాడు. రెప్పపాటులో ప్రమాదాన్ని పసిగట్టి ఓ సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్ అన్నకు సోషల్ మీడియాలో ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. బెంగుళూర్ మహాలక్ష్మీ లేఅవుట్ దగ్గర నిత్యం రద్దీగా ఉంటుంది. ఆ రూట్‌లో ఓ వ్యక్తి బైక్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు మీద వెళ్తున్న గంగిఎద్దు సడన్‌గా బెదిరిపోయి వ్యక్తిపై దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా వ్యక్తి కిందపడిపోయాడు.
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಭಯಾನಕ ಅಪಘಾತವೊಂದು ನಡೆದಿದೆ. ರಸ್ತೆ ಬದಿ ನಡೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಿದ್ದ ಕೋಲೆ ಬಸವ, ಎದುರಿಗೆ ಬರುತ್ತಿದ್ದ ಬೈಕ್ ಸವಾರ ಮೇಲೆ ಎರಗಿ ಓಡಿ ಹೋಗಿದೆ. ಬೈಕ್ ಸವಾರ ಬೀಳುತ್ತಿದ್ದಂತೆ ಟ್ರಕ್ ಚಾಲಕ ಬ್ರೇಕ್ ಹಾಕಿದ್ದಾನೆ.#KoleBasava #MahalakshmiLayout #Bengaluru #Karnataka #NewsFirstLive #NewsFirstKannada pic.twitter.com/CrJylJidC0
— NewsFirst Kannada (@NewsFirstKan) April 5, 2024
పక్కనే వెళ్తున్న ట్రక్ కింద పడ్డాడు. డ్రైవర్ బ్రేక్ వేయడం కొద్దిగా ఆలస్యం అయ్యుంటే బైక్ నడిపిన వ్యక్తి ట్రక్ కింద పడి ప్రాణాలు కోల్పోయేవాడు. కానీ ట్రక్ డ్రైవర్ బైక్ నడిపిన వ్యక్తి కింద పడటాన్ని గమనించి వెంటనే సడన్ బ్రేక్ వేశాడు. ప్రాణాపాయం తప్పి. చిన్న చిన్న గాయాలతో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఈ ప్రమాదం బెంగుళూర్ లో గత వారం జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.