మరోసారి మొరాయించిన రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

మరోసారి మొరాయించిన రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారు

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారు పదేపదే మొరాయిస్తోంది. తాజాగా ఇవాళ అఫ్జల్ గంజ్ మార్కెట్ వద్ద ఆయన కారు మొరాయించింది. డ్రైవర్ కారు దిగి మళ్లీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు  మొరాయించడానికి కారణం తెలుసుకునేందుకు రాజాసింగ్ సైతం కారు దిగి  ప్రయత్నం చేసినా కారు స్టార్ట్ కాలేదు. 

దీంతో రాజాసింగ్ తన కారును, డ్రైవర్ ను అక్కడే వదిలేసి.. నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. కండీషన్ లో ఉన్న వాహనం ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని ఇంటిలిజెన్స్ ఐజీకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవ‌టం లేదని రాజాసింగ్ ఆరోపించారు. ప్రాణహాని ఉన్న తన పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.