కావేరీ సీడ్స్​కు రూ.10 కోట్ల లాభం

కావేరీ సీడ్స్​కు రూ.10 కోట్ల లాభం

హైదరాబాద్​, వెలుగు : విత్తన ఉత్పత్తి కంపెనీ కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్ ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ.10.72 కోట్ల లాభాన్ని ఆర్జించింది.  2022 రెండో క్వార్టర్​లో రూ.2.72 కోట్లు ఆర్జించింది.  ఈక్విటీ షేర్‌‌‌‌కు రూ.5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌‌‌‌ను ప్రకటించింది. హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఈ కంపెనీకి తాజా క్వార్టర్లో రూ.96.12 కోట్ల ఆదాయం వచ్చింది.

గత ఏడాది రెండో క్వార్టర్లో రూ.84.49 కోట్లు వచ్చాయి. గ్లోబల్​గా బియ్యం ధరల పెరుగుదల వల్ల మేలు జరిగిందని,  కూరగాయల వ్యాపారంలోనూ విజయాలు సాధించామని కావేరీ సీడ్స్​ సీఎండీ జీవీ భాస్కర్ రావు అన్నారు. కంపెనీ  ఇప్పుడు టాంజానియా, అల్జీరియా, ఐవరీ కోస్ట్, థాయిలాండ్ తదితర దేశాల మార్కెట్లపై దృష్టి సారించింది.