కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా

కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా

ఓవల్: టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 24 టెస్టుల్లో 100 వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. సోమవారం ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. 
అంతకు ముందు కపిల్ దేవ్ 25 టెస్టుల్లో 100 వికెట్లు తీసి రికార్డు సృష్టించగా.. ఈ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. 1983 ప్రపంచకప్ విజేతగా నిలిపి భారత జట్టును క్రికెట్ రారాజుగా ఎదిగేలా కపిల్ దేవ్ చేసిన కృషి చిరస్మరణీయం. అయితే టీమిండియాలో స్థానం సంపాదించి అతితక్కువ సమయంలోనే ప్రధాన బౌలర్ గా ఎదిగిన బుమ్రా కేవలం 24 మ్యాచుల్లోనే వంద వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డు ఎక్కాడు. ఇప్పటి వరకు 100 వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా 8వ స్థానంలో నిలిచాడు. 
సోమవారం మ్యాచ్ చివరి రోజు రెండో షెషన్ లో బుమ్రా ఒల్లీ పోప్ వికెట్ తీసి వంద వికెట్ల మైలు రాయి అందుకున్నాడు. టెస్టుల్లో 100 వికెట్లు తీసిన 23వ భారత బౌలర్ గా రికార్డుకెక్కాడు. మిగిలిన వారికంటే సగటు రేటు కూడా 22.45, స్ట్రైక్ రేట్ 50.2 తో మాజీ పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తో సమానంగా నిలిచాడు. ఇర్ఫాన్ పఠాన్ 29 టెస్టుల్లో 100 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.