నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో రాస్తారోకో .. బురదగూడ గ్రామంలో గ్రామస్తుల నిరసన

నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో రాస్తారోకో .. బురదగూడ గ్రామంలో గ్రామస్తుల నిరసన

కాగజ్‌నగర్‌, వెలుగు : గ్రామంలో నెల రోజులుగా  తాగునీరు సరిగా రావడం లేదని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఖాళీ బిందెలతో కాగజ్ నగర్ మండలం బురదగూడ గ్రామస్తులు, మహిళలు ప్రధాన రహదారిపై శనివారం ఉదయం రాస్తారోకో చేశారు. 

గ్రామంలో నెల రోజుల నుంచి బోర్లు చెడిపోయి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని వాపోయారు. ప్రధాన రోడ్డు మీద ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న ఎంపీడీవో  కోట ప్రసాద్ అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడంతో శాంతించారు.