లైఫ్​లోని ఏదో ఒక స్టేజ్​లో బర్న్​ అవుట్​ బారిన పడుతున్నరు

లైఫ్​లోని ఏదో ఒక స్టేజ్​లో బర్న్​ అవుట్​ బారిన పడుతున్నరు

బర్న్​ అవుట్​’..వర్క్​ప్లేస్​లో తరచూ వినిపించే పదం. శారీరకంగా, మానసికంగా పూర్తిగా  అలిసి పోయామని అర్థం. పందొమ్మిదేండ్లు దాటిన ప్రతి నలుగురిలో ఒకరు తమ  లైఫ్​లోని ఏదో ఒక స్టేజ్​లో ఈ బర్న్​ అవుట్​ బారిన పడుతున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటర్నేషనల్​ క్లాసిఫికేషన్​ ఆఫ్​ డిసీజ్​ల్లో దీన్నీ చేర్చింది. అయితే ఈ బర్న్ అవుట్​ మనిషిని ఎలా ఎఫెక్ట్​ చేస్తుంది?  దీన్నెలా గుర్తించాలి?  అన్న విషయాలు యూకెకి చెందిన ఫేమస్​ సైకాలజిస్ట్​ డాక్టర్​ లలిత సుల్గాని ఇలా వివరించారు. 

విపరీతమైన పని ఒత్తిడి, విరక్తి లేదా శారీరక, మానసిక ప్రశాంతత లేని చోట ఎక్కువ రోజులు పనిచేయడం.. లాంటివన్నీ బర్న్​ అవుట్​కి దారితీస్తాయి. అయితే అన్ని సందర్భాల్లో ఆఫీసు వాతావరణమే  దీనికి కారణం  అని చెప్పలేం. జీవితంలో పలు దశల్లో కోరుకునే డిమాండ్​లకి అనుగుణంగా బతకలేకపోవడం, ఎమోషనల్​గా అందరితో డిటాచ్​ అవడం కూడా బర్న్​అవుట్​కి దారితీస్తుంది. ఈ పరిస్థితి ఎక్కువ రోజులు ఉంటే.. జీవితంలో నిరాశ నిండిపోతుంది. కోపం, చిరాకు, యాంగ్జైటీ పెరిగిపోతాయి. డిప్రెషన్​ ఛాయలు అల్లుకుంటాయి. వాటివల్ల ఇల్లు, ఆఫీసు పని, సోషల్​ లైఫ్​... ఇలా అన్నీ దెబ్బతింటాయి. అలా కాకూడదంటే ముందుగానే దీన్ని గుర్తించాలి. ముఖ్యంగా ఆఫీస్​ బర్న్​ అవుట్​ని కంట్రోల్​ చేయాలి.

బర్న్​ అవుట్​ ల‌‌క్షణాలు చాలా ఉంటాయి. ఇవి ఒక్కొక్కరిలో ఒక్కోలా క‌‌నిపిస్తుంటాయి. అయితే, అందరిలోనూ క‌‌నిపించే కొన్ని లక్షణాలు మాత్రం ఇవే. బాగా ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఏదైనా బాధపెట్టే సంఘటన జరిగినప్పుడు  శరీరంతో పాటు మనసుపై కూడా ప్రభావం పడుతుంది. దానివల్ల ఏ పనీ చేయలేమన్న నిరాశ. ఎప్పుడూ ఇష్టంగా చేసే పనుల మీద కూడా ఇంట్రెస్ట్‌‌ తగ్గిపోవడం లాంటివి కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఆఫీసులో పని గంటలు ఎక్కువ కావడం, పనికి తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల  ఈ సిచ్యుయేషన్స్​ని ​ చాలామంది ఎదుర్కొంటున్నారు. ​
 ఎవరి జీవితంతో వాళ్లు సంతృప్తిగా లేకపోవడం, కాన్ఫిడెన్స్​ కోల్పోవడం  కూడా బర్న్​ అవుట్​కి  సిగ్నల్స్​.  

ఏకాగ్రత తగ్గడం, చిన్న చిన్న విషయాల్ని కూడా మర్చిపోవడం, అలసట, మానసికంగా నిలకడ లేకపోవడం లాంటివి కూడా బర్న్​ అవుట్​ కిందకే వస్తాయి. ఒకటే తప్పుని పదేపదే రిపీట్​ చేయడం కూడా బర్న్​ అవుట్​ లక్షణాల్లో ఒకటి. ఒకే విషయం గురించి ఎక్కువ రోజులు బాధపడటం. చిన్న విషయాలకే ఏడవడం కూడా బర్న్అవుట్​కి  మొదటి స్టేజ్​గా చెప్పొచ్చు.జీవితం లో ఏదీ  బాగా జరగదనే నిరాశ బర్న్​ అవుట్​కి తాళం చెవి లాంటిది. 

బర్న్​ అవుట్​ సమస్య ఉన్న వాళ్లు నిద్రలేమితో బాధ పడుతుంటారు లేదా విపరీతంగా నిద్ర పోతుంటారు.  ఓడిపోయామన్న ఫీలింగ్​, నిస్సహాయత కూడా బర్న్​ అవుట్​కి పెద్ద సిగ్నల్స్​.‘నాకు ఎవరూ లేరు. నన్ను ఎవరూ సపోర్ట్​ చేయరు’ అనే ఆలోచనలు పదేపదే వచ్చినా అది బర్న్​ అవుట్​కి దారే. ఈ​ లక్షణాలు కనిపిస్తే  వాటి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడే ప్రయత్నం చేయాలి. యోగా,  పాటలు పాడటం​, డాన్స్​ చేయడం.. ఇలా నచ్చిన పని చేస్తూ మైండ్​ని పాజిటివ్​ ఆలోచనల వైపు మళ్లించాలి.  సమస్య గురించి ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడాలి. ఆఫీసులో అన్ని పనులు మీద వేసుకోకూడదు. కెపాసిటీ, టైం బట్టి బౌండరీలు పెట్టుకోవాలి. అవసరమైతే ఉద్యోగం నుంచి బ్రేక్​ తీసుకోవాలి. పరిస్థితి చెయ్యి దాటింది అనిపిస్తే సైకాలజిస్ట్​ని కలిసి థెరపీ తీసుకోవాలి.