
కోల్ కతా: ఉత్తర్ ప్రదేశ్ లో వలస కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు యాక్సిడెంట్ జరిగిన మరుసటి రోజే బెంగాల్ లో ఒక ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వలస కూలీలు ప్రయాణిస్తున్న ఓ బస్సు యాక్సిడెంట్ కు గురైన ఘటన వెస్ట్ బెంగాల్ లోని జల్పాయిగురిలో ఆదివారం జరిగింది. సహుదంగీలోని ఇటుకల ఫ్యాక్టరీలో పని చేసే వలస కార్మికులతో నిండి ఉన్న సదరు బస్సు జల్పాయిగురి జిల్లాలోని ధుప్ గురి బ్లాక్ నుంచి కూచ్ బెహార్ కు వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారని చెప్తున్నారు. వీరిని ధుప్గురిలోని ఆస్పత్రిలో చేర్పించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని సమాచారం.