మహిళ నుంచి టికెట్ డబ్బులు వసూలు చేసిన బస్ కండక్టర్.. వీడియో వైరల్

మహిళ నుంచి టికెట్ డబ్బులు వసూలు చేసిన బస్ కండక్టర్.. వీడియో వైరల్

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే..అయితే బస్సులో ప్రయాణిస్తున్న మహిళలనుంచి ఓ కండక్టర్ ఛార్జీలను వసూలు చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏపీ 25జెడ్ 0062 నెంబరు గల బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తుండగా ముగ్గురు మహిళలు నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ముగ్గురు మహిళల దగ్గర బస్సు టికెట్ కోసం డబ్బులు వసూలు చేశాడు కండక్టర్.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్పుల్లో ఉచిత ప్రయాణం ప్రకటించిందికదా..ఎందుకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని మహిళలు ప్రశ్నిస్తే..అలాగే వసూలు చేస్తా..అంటూ కండక్టర్ సమాధానం ఇచ్చారు. దీంతో నివ్వెర పోయిన మహిళలు బంధువుల సాయంతో వీడియో రికార్డు చేసి నిజామాబాద్ డిపో మేనేజరుకు ఫిర్యాదు చేసింది. 

ఈ విషయంపై స్పందించిన నిజామాబాద్ డిపో మేనేజర్.. మా డిపోనుంచి అన్ని పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం.. అయితే మహిళల నుంచి డబ్బులు వసూలు చేసిన కండక్టర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.