ఢిల్లీ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. విమానం పక్కనే.. కొద్ది మీటర్ల దూరంలో బస్సులో మంటలు చెలరేగడం టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మంగళవారం (అక్టోబర్ 28) ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్ 3 దగ్గర.. విమానాశ్రయానికి సర్వీసులు అందించే ప్రైవేట్ సంస్థ (SATS) కు చెందిన బస్సులో మంటలు అంటుకోవడం అధికారులను కలవరపాటుకు గురిచేసింది. ఎయిర్ ఇండియా విమానానికి కొద్ది దూరంలోనే బస్సు అగ్నిప్రమాదానికి గురైంది.
బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే ఎయిర్ పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. బస్సులో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తోంది SATS సంస్థ. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులకు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క డ్రైవర్ మాత్రమే ఉన్నాడని.. క్షేమంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు.
►ALSO READ | జైపూర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. హైటెన్షన్ వైర్ తాకి మంటల్లో చిక్కుకొని ముగ్గురు మృతి..
మూడు టెర్మినల్స్, నాలుగు రన్ వేస్ ఉన్న ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు రోజుకు వెల మంది ప్రయాణికులు వస్తుంటారు. విమానానికి కొద్ది దూరంలోనే బస్సు ప్రమాదం జరగటం ఓయిర్ పోర్టు అధికారులను కాసేపు అందోళనలకు గురిచేసిందనే చెప్పాలి.
— Delhi Airport (@DelhiAirport) October 28, 2025
