
ఖానాపూర్, వెలుగు: ఆధునికత పెరిగి రిఫ్రిజిరేటర్లు వాడుతున్న కాలంలోనూ కుండలు చేసి వాటిని అమ్మడానికి కొంతమంది ఎండలో కష్టపడుతున్నారు. రోడ్డు పక్కన కుండలను పెట్టుకుని కొనేవారి కోసం ఎదురు చూస్తున్నారు.
ఒకప్పుడు కుండలో నీరు తాగేందుకు ప్రజలు ఇష్టపడేవారు. ఇప్పుడు అందరూ రిఫ్రిజిరేటర్ల లోని నీటినే తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో వీరి కుండలు కొనుగోలు చేసేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు.