మంత్లీ గోల్డ్ స్కీమ్స్ తో నగలే కొంటున్నరు

మంత్లీ గోల్డ్ స్కీమ్స్ తో నగలే కొంటున్నరు

మొదటి ఇన్‌‌‌‌స్టాల్‌‌మెంట్‌‌పై 75 శాతం వరకు డిస్కౌంట్‌‌

రూ. 500 తోనే  స్కీమ్‌‌లో జాయిన్ అవ్వొచ్చు

కొత్త స్కీమ్‌‌లతో ఆకర్షిస్తున్న జ్యువలరీ కంపెనీలు

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు:  ధరలు ఆకాశాన్ని తాకినా గోల్డ్‌‌‌‌పై మహిళలకు ఇష్టం పోవడం లేదు. తయారీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి  బంగారు నగలపై ఇన్వెస్ట్‌‌‌‌ చేయడం మంచిది కాదని ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌లు చెబుతున్నా వీరి ఆలోచనలు మారడం లేదు. కస్టమర్లను ముఖ్యంగా మహిళలను ఆకర్షించేందుకు జ్యువలరీ కంపెనీలు మంత్లీ స్కీమ్‌‌‌‌లతో ముందుకొస్తున్నాయి. నెల నెల కొంత అమౌంట్‌‌‌‌ కట్టండి..చివరిలో బంగారు నగలను పొందండి అంటూ ఆకర్షిస్తున్నాయి. రోజు రోజుకి  గోల్డ్‌‌‌‌ ధరలు పెరుగుతుండడంతో  మిడిల్‌‌‌‌ క్లాస్‌‌‌‌ వారికి ఈ స్కీమ్‌‌‌‌లు నచ్చుతున్నాయి. ఈ మంత్లీ స్కీమ్‌‌‌‌లను ఎంచుకున్న కస్టమర్లు 12 నెలల పాటు నెలకు ఫీక్స్‌‌‌‌డ్‌‌‌‌ అమౌంట్‌‌‌‌ కట్టి 12 నెలలు పూర్తయ్యాక  ఈ అమౌంట్‌‌‌‌కు బదులుగా  ఏదైనా జ్యువలరీని తీసుకోవచ్చు. అంటే ఒక నగను కొనాలనుకొని డబ్బులేక ఆగిపోవాల్సిన పనిలేదు. ఆ నగ ధరకు  సమానమైన డబ్బులను ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్లలో పూర్తి చేసి ఆ నగను పొందొచ్చు. ఈ స్కీమ్‌‌‌‌ ఎంచుకున్న కస్టమర్లకు కంపెనీలు ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్లలో  డిస్కౌంట్లు, తరుగులో రాయితీ వంటివి ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. ప్రస్తుతం తనిష్క్‌‌‌‌, జోస్‌‌‌‌ ఆలుక్కాస్‌‌‌‌, జీఆర్‌‌‌‌‌‌‌‌టీ జ్యువల్స్‌‌‌‌ వంటి జ్యువలరీ కంపెనీలు ఆఫర్ చేస్తున్న  గోల్డ్‌‌‌‌ స్కీమ్‌‌‌‌లు కిందున్నాయి..

తనిష్క్‌‌‌‌ గోల్డెన్‌‌‌‌ హార్వెస్ట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌

ఈ స్కీమ్‌‌‌‌ను ఎంచుకున్న కస్టమర్లు కనీసం రూ. 2,000ల(రూ. 1,000 కి మల్టిపుల్‌‌‌‌ అమౌంట్‌‌‌‌)  నుంచి నెల ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌గా చెల్లించాలి. 10 నెలల వరకు ప్రతీ నెల మొదటి నెల చెల్లించిన మొత్తాన్నే ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌గా కట్టాల్సి ఉంటుంది.   ఈ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను జ్యువలరీ షోరూమ్‌‌‌‌లోనైనా, కంపెనీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ లేదా తనిష్క్‌‌‌‌ గోల్డెన్‌‌‌‌ హార్వెస్ట్‌‌‌‌ మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారానైనా చెల్లించొచ్చు. ఈ స్కీమ్‌‌‌‌ మెచ్యూరిటీ అయ్యే టైమ్‌‌‌‌కి మొదటి  ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ అమౌంట్‌‌‌‌పై 75 శాతం వరకు స్పెషల్‌‌‌‌ డిస్కౌంట్‌‌‌‌ను తనిష్క్‌‌‌‌ ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ఉదాహరణకు కస్టమర్‌‌‌‌‌‌‌‌ నెలకు రూ. 2,000 చొప్పున గోల్డ్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ కడుతున్నారని అనుకుంటే, 10 నెలల్లో కస్టమర్‌‌‌‌‌‌‌‌ చెల్లించిన డబ్బులు రూ. 20,000 లకు చేరుకుంటాయి. 13 వ నెల నాటికి కస్టమర్‌‌‌‌‌‌‌‌ రూ. 21, 500 విలువైన బెనిఫిట్స్‌‌‌‌ను లేదా గోల్డ్‌‌‌‌ జ్యువలరీని పొందొచ్చు. కాగా, గోల్డెన్‌‌‌‌ హార్వెస్ట్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ను ఓపెన్ చేసిన 400 రోజుల్లోనే ఈ స్కీమ్‌‌‌‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

జోస్‌‌‌‌ ఆలుక్కాస్‌‌‌‌  ఈజీ బై గోల్డ్‌‌‌‌ పర్చేజ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌..

ఈ స్కీమ్‌‌‌‌ను ఎంచుకోవాలనుకునే కస్టమర్లు జోస్‌‌‌‌ ఆలుక్కాస్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోకి వెళ్లి జాయిన్‌‌‌‌ కావొచ్చు. ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్స్‌‌‌‌ అన్నింటిని పూర్తి చేశాక‌‌‌‌ కస్టమర్‌‌‌‌‌‌‌‌ చెల్లించిన డబ్బులకు సరిపోయే నగలను జోస్‌‌‌‌ ఆలుక్కాస్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో లేదా షోరూమ్‌‌‌‌లలో పొందొచ్చు. డెబిట్‌‌‌‌ లేదా క్రెడిట్‌‌‌‌ కార్డ్‌‌‌‌, నెట్‌‌‌‌ బ్యాంకింగ్ వంటి పేమెంట్‌‌‌‌ విధానాల ద్వారా కస్టమర్లు ఈ మంత్లీ స్కీమ్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ కావొచ్చు.  18 ఏళ్లు దాటిన వారు నెలకు రూ. వేయి లేదా రూ. రెండు వేలు లేదా రూ. ఐదు వేలు ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌తో ఈ స్కీమ్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ అవ్వొచ్చు. ఒక వేళ ఏదైనా నెలలో ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ కట్టలేకపోతే తర్వాతి నెలలో  కట్టొచ్చు.

జీఆర్‌‌‌‌‌‌‌‌టీ గోల్డెన్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ ఫ్లెక్స్‌‌‌‌ ప్లాన్‌‌‌‌..

ఈ స్కీమ్‌‌‌‌ను ఎంచుకున్న కస్టమర్‌‌‌‌‌‌‌‌ నెలకు కనీసం రూ. 500 ల నుంచి  ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌గా  కట్టొచ్చు.‌‌‌‌  11 నెలల పాటు ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి నెల ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ను పూర్తి చేసిన కస్టమర్‌‌‌‌‌‌‌‌ తను కట్టిన డబ్బులకు సమానమైన గోల్డ్‌‌‌‌ జ్యువలరీని కొనుగోలు చేసుకోవచ్చు.  ఈ స్కీమ్‌‌‌‌ ఎంచుకున్న కస్టమర్లకు తరుగులో రాయితీని ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది జీఆర్‌‌‌‌‌‌‌‌టీ. స్పెషల్‌‌‌‌ ఐటెమ్స్‌‌‌‌ కావాలనుకుంటే తరుగు లేదా వాల్యూ అడిషన్ ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. చివరి నెల ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ను పూర్తి చేశాక కస్టమర్‌‌‌‌‌‌‌‌ విలువ పరంగా లేదా గోల్డ్‌‌‌‌ వెయిట్‌‌‌‌ పరంగా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఒక వేళ ఈ స్కీమ్‌‌‌‌ను ఎంచుకొని ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను పూర్తి చేయలేకపోతే  అతని డబ్బులను రిఫండ్‌‌‌‌ చేస్తారు. లలితా జ్యువలర్స్​తో పాటు మరికొన్ని జ్యువలరీ కంపెనీలు కూడా మంత్లీ గోల్డ్‌‌ స్కీమ్స్‌‌ను ఆఫర్ చేస్తున్నాయి.

గరిష్టాల నుంచి రూ. 7,000

తగ్గిన ఎంసీఎక్స్‌‌‌‌ గోల్డ్‌‌

ఇండియన్‌‌ మల్టికమోడిటీ ఎక్స్చేంజ్‌‌ (ఎంసీఎక్స్‌‌)లో 10 గ్రాముల  గోల్డ్‌‌ ధర రూ. 49,500 కిందికి పడింది. ఇది ఆగస్ట్‌‌ 7 న నమోదు చేసిన రికార్డు స్థాయి రూ. 56,200 కంటే రూ. 6,700 తక్కువ కావడం విశేషం. ఎంసీఎక్స్‌‌లో  కేజి వెండి ధర కూడా రూ. 58 వేల కిందకు దిగొచ్చింది. గత నెలలో కేజి వెండి ధర రూ. 80 వేల వద్ద రికార్డ్‌‌ స్థాయిని తాకింది. గోల్డ్‌‌లో ఇన్వెస్ట్‌‌ చేయాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత స్థాయిలు ఆకర్షణీయంగా ఉన్నాయని ఇన్వెస్టర్లు చెబుతున్నారు.