బైజూస్‌‌‌‌‌‌‌‌కు రూ.2,253 కోట్ల నష్టం

బైజూస్‌‌‌‌‌‌‌‌కు రూ.2,253 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: బైజూస్ పేరెంట్ కంపెనీ  థింక్ అండ్ లెర్న్‌‌‌‌‌‌‌‌  ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (టీఎల్‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌‌‌‌‌) 2021–22 లో రూ.2,253 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు      ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాస్ రూ.2,406 కోట్లుగా ఉంది. కంపెనీ  రెవెన్యూ మాత్రం అంతకు ముందు ఏడాదిలో వచ్చిన రూ.1,552 కోట్ల నుంచి రూ.3,569 కోట్లకు పెరిగింది.  

కోర్ బిజినెస్  మంచి గ్రోత్ నమోదు చేసిందని, దేశంలో ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌కు ఉన్న సామర్ధ్యానికి ఇది నిదర్శనమని కంపెనీ సీఈఓ బైజూ రవీంద్రన్ పేర్కొన్నారు. కరోనా సంక్షోభం తర్వాత అడ్జెస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడ్డామని, ఇక నుంచి లాభాలు సాధించే దిశగా బైజూస్ నడుస్తుందని చెప్పారు. యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగే ముందు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌‌‌‌‌‌‌‌కు రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ సబ్మిట్ చేయనుంది.