జూలై 10న 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

  జూలై 10న 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ జూన్ 10వ తేదీన  షెడ్యూల్ రిలీజ్ చేసింది. 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జులై 10న పోలింగ్ జరగనుంది, జులై 12న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్ లో  4, హిమాచల్ ప్రదేశ్ లో  3, ఉత్తరాఖండ్ లో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా...   బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో ఒక్కో స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.

బీహార్ లో (రూపాలి నియోజకవర్గం), పశ్చిమ బెంగాల్ లో ( రాయ్ గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మాణిక్తలా), తమిళనాడు లో (విక్రవాండి), మధ్యప్రదేశ్ లో (అమరవాడ), ఉత్తరాఖండ్ లో (బద్రీనాథ్, మంగళూరు), పంజాబ్ లో (జలంధర్ వెస్ట్), హిమాచల్ ప్రదేశ్ లో  (డెహ్రా, హమీర్పూర్, నలగర్) అసెంబ్లీ నియోజకవర్గాలకు జూలై 10న పోలింగ్ జరగనుంది.

ఈ ఉప ఎన్నికలకు  జూన్ 14 నోటిఫికేషన్ జారీ కానుంది.  జూన్ 21 నామినేషన్ దాఖలుకు చివరి తేదీ .  నామినేషన్ పరిశీలన జూన్ 24 వరకు, ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 26 వరకు ఉంటుంది.