సీఏఏను తప్పక అమలు చేస్తాం

సీఏఏను తప్పక అమలు చేస్తాం

కోల్‌‌కతా: కొన్నాళ్లుగా నిలిచిపోయిన సిటిజన్‌‌షిప్ అమెండ్‌‌మెంట్ యాక్ట్‌‌ (సీఏఏ)ను మళ్లీ అమలు చేసే దిశగా కేంద్రం యోచిస్తోందని తెలుస్తోంది. తాజాగా ఈ అంశంపై బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్‌‌వర్గియా స్పందించారు. బెంగాల్‌‌లో సీఏఏను త్వరలో అమలు చేయబోతున్నామని తెలిపారు. ‘బెంగాల్‌లో సీఏఏ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పినా కేంద్రం తప్పక అమలు చేసి తీరుతుంది. ఒకవేళ కేంద్రానికి రాష్ట్ర సర్కార్ మద్దతునిస్తే అమలు ప్రక్రియ సులభతరం అవుతుంది. సీఏఏ మీద త్వరలో అమిత్ షా స్పష్టతనిస్తారు’ అని కైలాశ్ పేర్కొన్నారు.