పాల పుంతల్లో..జంట మేఘాలై

పాల పుంతల్లో..జంట మేఘాలై

కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’.  జులై 12న సినిమా విడుదల  కానుంది.  ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్..  ఇప్పటికే మూడు పాటలను  రిలీజ్ చేయగా.. సోమవారం క్యాలెండర్ సాంగ్ పేరుతో  మరో పాటను రిలీజ్ చేశారు. అనిరుధ్ కంపోజ్ చేయగా చంద్రబోస్  తెలుగు లిరిక్స్ రాశారు. శ్రావణ భార్గవి పాడింది. ఈ స్పెషల్ సాంగ్‌‌‌‌లో సౌత్‌‌ ఆఫ్రికా మోడల్,  2017 మిస్ యూనివర్స్ డెమీ లీ టెబో తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌తో ఆకట్టుకుంది. 

‘పాల పుంతల్లో వాలి.. జంట మేఘాలై తేలి.. భూమితో పనిలేకుండా గడిపేద్దామా.. వెన్నెల మాటలు కొన్ని.. చుక్కల ముద్దులు కొన్ని.. దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా.. లోకమే కీటకమంట.. అందమే మతాబు మంట’ అంటూ సాగిన పాటలో  విజువల్స్‌‌‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శంకర్ తన గత  చిత్రాల్లోని పాటలను రియల్ లొకేషన్స్‌‌‌‌లో అద్భుతంగా చిత్రీకరిస్తారు. ఈ పాటలోనూ ఆయన తనదైన మార్క్‌‌‌‌ను చూపించారు.  సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌‌‌‌.జె.సూర్య, బాబీ సింహ, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని  లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్‌‌‌‌  మూవీస్ సంస్థలు  నిర్మిస్తున్నాయి.