ఇక కరోనా కాలర్ ట్యూన్‌కు గుడ్ బై?

ఇక కరోనా కాలర్ ట్యూన్‌కు గుడ్ బై?

ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు, ఎవరికి ఫోన్ చేసినా సరే.. ఫ్ట్ వినిపించేంది కరోనా జాగ్రత్తలతో వచ్చే కాలర్ ట్యూన్. రెండేళ్ల క్రితం కరోనా వ్యాప్తి మొదలైన సమయంలో ప్రజలను నిత్యం అవగాహన పరుస్తూ అప్రమత్తంగా ఉంచాలన్న ఆలోచనతో ప్రారంభించిన ఈ కాలర్ ట్యూన్ ఇకపై మూగబోనుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కాలర్ ట్యూన్ ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు వెయ్యి, రెండు వేల లోపే ఉండడంతో ఇక దీని అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోందని, ఈ మేరకు టెలికాం శాఖకు సూచనలు పంపిందని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

2020 మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్, ఐడియా కంపెనీలు కరోనా కాలర్ ట్యూన్ ను ప్రారంభించాయి. మొదట్లో కరోనా లక్షణాలు, జాగ్రత్తల గురించి ఈ కాలర్ ట్యూన్ వచ్చేది. ఆ తర్వాత కరోనా వ్యాక్సినేషన్ స్పీడ్ గురించి ప్రస్తావిస్తూ.. అందరూ టీకా వేసుకోవాలని, అదే సమయంలో జాగ్రత్తలపై నిర్లక్ష్యం వద్దని చెబుతూ ఆ ట్యూన్ వస్తోంది.

కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,259 మంది కరోనా బారినపడ్డారని మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ నాటి కేసుల స్థాయికి డైలీ కేసులు పడిపోయాయి.

మరిన్ని వార్తల కోసం..

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

మంచు ఎఫెక్ట్ తో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

రాహుల్ గాంధీ ట్వీట్ కి కవిత కౌంటర్