భార్యను తెలివి తక్కువది అనడం క్రూరత్వం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భార్యను తెలివి తక్కువది అనడం క్రూరత్వం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వరకట్నం కేసులో  సర్వోన్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్త తన భార్యను తెలివి తక్కువది, పనికిరానిది అనడం నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఐపీసీ సెక్షన్​ 498A కిందకు రావని వ్యాఖ్యానించింది.  2023లో కెనడాలో  ఆత్మహత్య చేసుకున్న ఓవివాహిత వరకట్నంలో కేసులో  సుప్రీంకోర్టు ఈవ్యాఖ్యలు చేసింది.  వివరాల్లోకి వెళితే.

భార్యను  తెలివి తక్కువది ,పనికిరానిది అని భర్త అనడం ఐపీసీ సెక్షన్ 498A కింద నేరంగా, క్రూరత్వంగా భావించలేమని, ఇలాంటి వ్యాఖ్యలు భర్త కోప స్వభావాన్ని, ప్రవర్తనా లోపాన్ని సూచించవచ్చని, అయితే వాటిని మాత్రమే ఆధారంగా చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేయలేమని స్పష్టం చేస్తూ కెనడాకు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య కేసులో ఆమె భర్తపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

కెనడాలో భార్య ఆత్మహత్య.. భర్తపై కేసు

వివరాల్లోకి వెళ్తే.. కెనడాలోని టొరంటోలో నివసిస్తున్న ఓ వివాహిత ఉద్యోగం దొరకకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో చదువు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించింది. అయితే, ఆమె మరణం తర్వాత తండ్రి భారత్​ లో ఆమె భర్తపై కట్న వేధింపులు, క్రూరత్వం వంటి ఆరోపణల ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. ఈ కేసులో భర్త తన భార్యను తెలివి తక్కువదని, పనికిరానిదని దూషించేవాడని ఆరోపించారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని భర్త కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది.

స్పష్టమైన ఆధారాలు ఉండాలి

ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భార్యను దూషించినంత మాత్రాన అది నేరపూరిత క్రూరత్వం కిందకు రాదని ధర్మాసనం అభిప్రాయపడింది. కేవలం కోపంతో మాట్లాడిన మాటలను క్రిమినల్ నేరంగా పరిగణించలేమని పేర్కొంది. భర్తపై కట్న వేధింపులు, శారీరక లేదా మానసిక హింసకు సంబంధించిన నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది. సాధారణమైన, అస్పష్టమైన ఆరోపణల ఆధారంగా క్రిమినల్ కేసులను కొనసాగించడం సరికాదని అభిప్రాయపడింది.

భర్తపై ఎఫ్‌ఐఆర్ కొట్టివేత

కేసులోని పరిస్థితులు, ఆధారాలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. భర్తపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది. భార్య ఆత్మహత్యకు భర్తే కారణమని నిర్ధారించడానికి అవసరమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఈ తీర్పు ద్వారా వైవాహిక వివాదాల్లో కేవలం సాధారణ ఆరోపణల ఆధారంగా క్రిమినల్ కేసులు కొనసాగించలేమనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.