గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

హనుమకొండ సిటీ/ జనగామ అర్బన్, వెలుగు: ప్రజా యుద్ధనౌక గద్దర్​ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రొఫెసర్​ కంచె అయిలయ్య అన్నారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయలో గద్దర్​ 2వ వర్ధంతి కార్యక్రమం గద్దర్​ ఫౌండేషన్, కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 

అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్, సీనియర్​ జర్నలిస్ట్​ పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణలో గద్దర్​ విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. గద్దర్​ వర్ధంతి సందర్భంగా జనగామ పట్టణంలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.