IND vs AUS : పట్టు విడువని ఆసీస్.. గ్రీన్ రికార్డు సెంచరీ.. డబుల్ సెంచరీ దిశగా ఖవాజా

IND vs AUS : పట్టు విడువని ఆసీస్.. గ్రీన్ రికార్డు సెంచరీ.. డబుల్ సెంచరీ దిశగా ఖవాజా

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు విడవకుండా ఆడుతుంది. భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ పరుగులు రాబడుతోంది. దీంతో రెండో రోజు మొదటి సెషన్ ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. నిన్న మ్యాచ్ ను నిలబెట్టిన సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజ్(159, 372 బంతుల్లో) డబుల్ సెంచరీ దిశగా అడుగులు వేస్తుంటే.. అతనికి సహకరిస్తూనే దాటిగా ఆడుతున్న కమేరున్ గ్రీన్ (112, 163 బంతుల్లో) తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

మొదటి రోజు పరవాలేదు అనిపించిన టీమిండియా బౌలర్లు రెండో రోజు తేలిపోయారు. తొలి సెషన్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మొదటి రోజు 255/4  స్కోరు సాధించిన ఆసీస్ రెండో రోజు 29 ఓవర్లలో 92 పరుగులు రాబట్టింది.