లెటర్​ టు ఎడిటర్ .. ప్రచార ఆర్భాటం!

లెటర్​ టు ఎడిటర్ ..  ప్రచార ఆర్భాటం!

అతి పెద్ద హల్దీవాగు ఉన్నా దాని పక్కనే వ్యవసాయ పొలాల నుంచే మరో కొత్త కాల్వ తీస్తూ ఒక్క తూప్రాన్ గ్రామంలోనే 131 ఎకరాలు, అలాగే గుండ్రడిపల్లి గ్రామంలో 250 ఎకరాల పచ్చని వ్యవసాయ భూమిని సేకరించడానికి రంగం సిద్ధమైంది.  దీంతో వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్న రైతన్నల బతుకులు దారుణంగా మారబోతున్నాయి.  తక్కువ వ్యయంతో కాలువ నిర్మాణానికి అవకాశాలు ఉన్నా ప్రభుత్వం వ్యవసాయ పొలాల నుంచే కాలువ తీయవలసిన అవసరం ఏమిటో తెలియడం లేదు. 

అధికారులు కూడా రైతులకు చెప్పడం లేదు. జిల్లా ఏకైక మంత్రిననే ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఒక్క ఎకరం తూప్రాన్ భూమిని కూడా కాళేశ్వరం కాలువలో పోనీయమని రైతులకు హామీ ఇచ్చారు. తర్వాత అలవాటు ప్రకారం మరిచిపోయారు. అహేతుకమైన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వందల గ్రామాల శివారులలో ఉన్న వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని సర్కారు తీసుకుని రైతులను ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదు. 

ALSO READ : జనాల డేటా వాడేస్తున్నరు బీఆర్ఎస్ చేతిలో పథకాల లబ్ధిదారుల లిస్టు

భూములు ఇచ్చే ఉద్దేశ్యం ఏ రైతుకూ లేదు. ఎందుకంటే భూమే రైతు జీవితం. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆశపడిన వారందరికీ ఆశాభంగం జరిగింది. నీటివసతి పేరుతో రైతుల భూములన్నీ పోయాక వచ్చే నీళ్లతో రైతులు ఏం చేసుకుంటారు?. ఇక కోటి ఎకరాలను ఎలా సాగులోకి తేగలరు.