భారత విమానాలపై కెనడా మరోసారి ఆంక్షలు పొడిగింపు 

V6 Velugu Posted on Jul 20, 2021

భారతీయ విమానాలపై ఆంక్షలను మరో సారి పొడిగించింది కెనడా. ఆగస్టు 21వ తేదీ వరకు భారత్ నుంచి వస్తున్న విమానాలపై సస్పెన్షన్ విధించినట్లు కెనడా ప్రభుత్వం లేటెస్టుగా తెలిపింది. కరోనా వైరస్ క్రమంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఇటీవల డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న కారణంగా విమాన ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలను పొడిగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇండియా, పాక్ నుంచి వెళ్లే విమానాలపై కెనడా బ్యాన్ విధించింది. ప్యాసింజర్‌, బిజినెస్ విమానాలను రద్దు చేశారు. అయితే ఆగస్టు నుంచి పూర్తిగా వ్యాక్సినేట్ అయిన వారికి అనుమతి కల్పించనున్నట్లు కెనడా ప్రకటించింది.

Tagged Canada extends, ban , India passenger flights, nother month

Latest Videos

Subscribe Now

More News