
జూనియర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర (Devara). ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.అంతే కాదండోయ్..దేవర గ్లింప్స్ కోసం కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఎదురుచూసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ట్రైలర్, రిలీజ్ పై కూడా ఫ్యాన్స్ ఊహలు చాలానే ఉన్నాయి.ఇక దేవర వచ్చేది దసరా కానుకగా (అక్టోబర్ 10) మేకర్స్ ప్రకటించాకా..మరింత ఆలస్యంతో దేవర దర్శనం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇక ఇప్పుడు దేవర సాంగ్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.ఈ సినిమాలో వచ్చే ఐటెం సాంగ్ కోసం కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi)ని మేకర్స్ తీసుకున్నట్లు సమాచారం.ప్రభాస్ బాహుబలి మనోహరి సాంగ్ తో కాలు కదిపినా ఈ భామ..ఇప్పటి వరకు పెప్పీ ఐటమ్ సాంగ్స్ లోనే చూసిన ఆడియాన్స్ కు దేవరతో తనలోని మరో కోణాన్ని కూడా బయటికి తెస్తుందంట. త్వరలో దేవర ఐటెం సాంగ్ అప్డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక నోరా ఫతేహి సినిమాలు చూసుకుంటే..క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో కూడా నటిస్తోంది. ఔరంగా జేబు చెల్లెలు..మహారాణి పాత్ర పోషిస్తుంది. అలాగే వరుణ్ తేజ్ మట్కా మూవీలో కూడా నటిస్తోంది.
ఇప్పటికే దేవర పార్ట్-1కు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తయింది. యువసుధ క్రియేషన్స్(Yuvasuda creations) అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దేవర సినిమా 2024 అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.