కెనడియన్‌‌ వుడ్‌‌ విల్లాను ప్రారంభించిన మ్యాక్‌‌ ప్రాజెక్ట్స్‌‌

కెనడియన్‌‌ వుడ్‌‌ విల్లాను ప్రారంభించిన మ్యాక్‌‌ ప్రాజెక్ట్స్‌‌

 హైదరాబాద్‌‌, వెలుగు: కెనడాలోని బ్రిటిష్‌‌ కొలంబియా (బి.సి) ప్రభుత్వ ఏజెన్సీ అయిన  ఫారెస్ట్రీ ఇన్నోవేషన్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ (ఎఫ్‌‌ఐఐ),  మ్యాక్‌‌ ప్రాజెక్ట్‌‌లు హైదరాబాద్‌‌ శివార్లలో బిటిఆర్‌‌ గ్రీన్స్‌‌లో ‘కెనడియన్‌‌ వుడ్‌‌ విల్లా’ పేరుతో అత్యాధునిక గేటెడ్‌‌ కమ్యూనిటీని ఆవిష్కరించాయి. కెనడా అడవుల నుంచి సేకరించిన చెక్క ద్వారా ఈ విల్లాలను నిర్మిస్తారు.   ఇందుకోసం ఎఫ్‌‌ఐఐ మ్యాక్​కు టెక్నాలజీ, ట్రైనింగ్,  ప్రాజెక్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ వంటి సేవలను అందజేసింది.  రాష్ట్ర హోం, జైళ్లు  అగ్నిమాపక శాఖ మంత్రి, మహమ్మద్‌‌ మెహమూద్‌‌ అలీ,  భారతదేశంలో కెనడా హైకమిషనర్‌‌  కామెరాన్‌‌ మాకే  కెనడియన్‌‌ వుడ్‌‌ విల్లా ప్రాజెక్ట్‌‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులలో తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాలకు రిపబ్లిక్‌‌ ఆఫ్‌‌ కజకిస్తాన్‌‌ గౌరవ కాన్సుల్‌‌  మ్యాక్‌‌ ప్రాజెక్ట్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌, ప్రమోటర్‌‌  మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌, డాక్టర్‌‌ నవాబ్‌‌ మీర్‌‌ నాసిర్‌‌ అలీ ఖాన్‌‌, ఫారెస్ట్రీ ఇన్నోవేషన్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌  సిఇఒ, మైఖేల్‌‌ లోసేత్‌‌  భారతదేశంలో కెనడియన్‌‌ వుడ్‌‌ కంట్రీ డైరెక్టర్​ ప్రాణేష్‌‌ చిబ్బర్‌‌లు ఉన్నారు.

ఈ సందర్భంగా కామెరాన్‌‌ మాకే మాట్లాడుతూ ‘‘విదేశాల్లో అత్యధికంగా భారతీయులు ఉన్న రెండో దేశం కెనడా. భారతదేశంతో మాకు సుదీర్ఘమైన సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య మా వాణిజ్యం విలువ ఇప్పుడు 100 బిలియన్‌‌ డాలర్లకు చేరువలో ఉంది. ఇది భారతదేశంలో  కెనడియన్‌‌ పోర్ట్‌‌ఫోలియో పెట్టుబడి  70 బిలియన్‌‌ డాలర్ల వరకు ఉంది. మౌలిక సదుపాయాలు, పోర్ట్‌‌లు, విమానాశ్రయాలలో పెట్టుబడులు పెట్టింది” అని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌‌ 2021 అక్టోబర్​లో మొదలవగా కేవలం 12 నెలల్లోపుగానే పూర్తి అయింది. ఒక విల్లా 15,000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. నిర్మాణ విస్తీర్ణం 6,000 చదరపు అడుగులు.

లివింగ్‌‌ ఏరియా, కిచెన్‌‌, ప్యాంట్రీ, అటాచ్డ్​ బాత్‌‌రూమ్‌‌లు కలిగిన నాలుగు బెడ్‌‌రూమ్‌‌లు, జిమ్​, స్పోర్ట్స్​ ఏరియా,  ఏవీ రూమ్‌‌, అవుట్‌‌డోర్‌‌ సిట్టింగ్‌‌  వంటి సదుపాయాలు ఉంటాయి.   బ్రిటిష్‌‌ కొలంబియా అడవుల్లోని ఎరుపు దేవదారు, పసుపు దేవదారు,  హేమ్లాక్‌‌లను వీటి నిర్మాణానికి వాడుతారు. ఒక్కో చదరపు అడుగుకు రూ.10 వేలు వసూలు చేస్తున్నామని మ్యాక్​ ప్రాజెక్ట్స్​ తెలిపింది.   మ్యాక్‌‌ ప్రాజెక్ట్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ ప్రమోటర్‌‌ & మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌, డాక్టర్‌‌ నవాబ్‌‌ మీర్‌‌ నాసిర్‌‌ అలీ ఖాన్‌‌ మాట్లాడుతూ  కలప కార్బన్‌‌ ఎమిషన్స్​ను తగ్గించి భవనం  జీవిత కాలాన్ని పెంచుతుందని చెప్పారు. తాము ఉపయోగించే కలప మన్నిక కాంక్రీటు, స్టీలు కంటే ఎక్కువ ఉంటుందని చెప్పారు.