
న్యూఢిల్లీ: అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కెనరా రొబెకో ఐపీఓ ఈ నెల 9–13 తేదీల్లో ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 253–-266 ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు రూ. 5,300 కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది. ఈ ఐపీఓ పూర్తిగా 4.98 కోట్ల ఈక్విటీ షేర్లతో కూడిన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్). ఫ్రెష్ఇష్యూ లేదు. ఓఎఫ్ఎస్లో ప్రమోటర్లు - కెనరా బ్యాంక్, ఓరిక్స్ కార్పొరేషన్ యూరప్ ఎన్వీ షేర్లను అమ్ముతాయి. కెనరా రొబెకోలో కెనరా బ్యాంకుకు 51 శాతం వాటా ఉంది. మిగిలినది ఓరిక్స్ దగ్గర ఉంది.
4 కంపెనీల ఐపీఓలకు గ్రీన్‌సిగ్నల్
కళ్లద్దాల రిటైలర్ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్, హోమ్ ఫర్నిషింగ్స్ కంపెనీ వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్ సహా మరో నాలుగు కంపెనీలు ఐపీఓలకు సెబీ నుంచి అనుమతి వచ్చింది. టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియా, వాటర్‌వేస్ లీజర్ టూరిజం, శ్రీ రామ్ ట్విస్టెక్స్, లమ్టఫ్ కూడా ఐపీఓ ద్వారా నిధులు సేకరించనున్నాయి. ఈ సంస్థలు జూన్-–జూలై మధ్య సెబీకి డాక్యుమెంట్లు ఇవ్వగా, సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 3 మధ్య ఆమోదం పొందాయి. లెన్స్‌కార్ట్ కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 2,150 కోట్లు సేకరించనుంది.