ప్రజ్ఞానంద, విదిత్‌‌‌‌‌‌‌‌ గెలుపు

ప్రజ్ఞానంద, విదిత్‌‌‌‌‌‌‌‌ గెలుపు

టొరంటో: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద, విదిత్‌‌‌‌‌‌‌‌ గుజరాతీ.. ఫిడే క్యాండిడెట్స్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో కీలక విజయాలు సాధించారు. గురువారం జరిగిన ఓపెన్‌‌‌‌‌‌‌‌ కేటగిరీ ఆరో రౌండ్‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞానంద 45 ఎత్తులతో నజత్‌‌‌‌‌‌‌‌ అబసోవ్‌‌‌‌‌‌‌‌ (అజర్‌‌‌‌‌‌‌‌బైజాన్‌‌‌‌‌‌‌‌)పై గెలవగా, విదిత్‌‌‌‌‌‌‌‌.. అలిరెజా (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)ను ఓడించాడు. టాప్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా గేమ్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టిన ప్రజ్ఞ టార్ష్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌తో ఆడాడు. టెక్నికల్‌‌‌‌‌‌‌‌గా చాలా బలంగా కనిపించిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ మధ్యలో ప్రత్యర్థి క్వీన్‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న పావును పడగొట్టి ఈజీగా గేమ్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. సోజిన్‌‌‌‌‌‌‌‌ వేరియేషన్‌‌‌‌‌‌‌‌తో ఆడిన విదిత్‌‌‌‌‌‌‌‌.. అలిరెజా సిసిలియన్‌‌‌‌‌‌‌‌ స్ట్రాటజీని అలవోకగా అడ్డుకున్నాడు. హికరు నకమురా (అమెరికా 3)తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌ను డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌ డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌ తర్వాత గుకేశ్‌‌‌‌‌‌‌‌ 4 పాయింట్లతో ఇయాన్‌‌‌‌‌‌‌‌ నెపోమినెట్చితో కలిసి సంయుక్తంగా టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. ప్రజ్ఞానంద 3.5, విదిత్‌‌‌‌‌‌‌‌3 పాయింట్లతో మూడు, ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. ఇక విమెన్స్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెలుగు గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ కోనేరు హంపి (2).. టింజి లీ (చైనా 3) చేతిలో, ఆర్‌‌‌‌‌‌‌‌. వైశాలి (2.5).. కెటరైనా లాగ్నో (రష్యా 3.5) చేతిలో ఓడారు.