కుటుంబాలతో వచ్చి ఓటేసిన అభ్యర్థులు, పలు పార్టీలకు చెందిన నేతలు..

కుటుంబాలతో వచ్చి ఓటేసిన అభ్యర్థులు, పలు పార్టీలకు చెందిన నేతలు..

ముషీరాబాద్/అల్వాల్/జీడిమెట్ల/గండిపేట, వెలుగు:  గురువారం గ్రేటర్ సిటీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని ఆయా సెగ్మెంట్లకు చెందిన అభ్యర్థులు, పలు పార్టీలకు చెందిన నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంనగర్ లోని జేవీ హైస్కూల్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన భార్య, కూతురితో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్​ చిక్కడపల్లిలో ఓటేశారు.  ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్, బీజేపీ అభ్యర్థి పూస రాజు, కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు ఆయా సెగ్మెంట్లలో ఓటు వేశారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శాస్త్రిపురంలోని పోలింగ్ బూత్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ మోండా మార్కెట్​లోని ఇస్లామియా స్కూల్​లో, సనత్ నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ వెస్ట్ మారేడ్​పల్లిలోని కేజీబీవీలో కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. జూబ్లీహిల్స్​లో​ కాంగ్రెస్​అభ్యర్ది అజారుద్దీన్,  అజంపురాలో హోంమంత్రి మహమూద్ అలీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  మొయినాబాద్​లో ఎంపీ రంజిత్ రెడ్డి, సనత్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ ఓటేశారు. మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబితా రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి చేవెళ్లలోని కౌకుంట్ల గ్రామంలో ఓటేశారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కాప్రాలోని విజయ హైస్కూల్​లో ఓటేశారు.