కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ పట్టివేత

కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ పట్టివేత

శంకరపట్నం, వెలుగు: గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మక్త గ్రామంలో శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా బిహార్ కు చెందిన రోషన్ కుమార్ వద్ద 46 గంజాయి చాక్లెట్స్ పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌వో తెలిపారు .

మరిన్ని వార్తలు