
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చూసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో బాలీవుడ్, టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ ఊర్వశీ రౌతేలా తళుక్కుమని మెరిసింది.
మంగళవారం (2025 మే 13) పార్టిర్ అన్ జోర్ (లీవ్ వన్ డే) సినిమా ప్రారంభోత్సవం, ప్రదర్శన కోసం రెడ్ కార్పెట్ మీద నడిచింది. ఉత్సాహభరితమైన, రంగురంగుల దుస్తులలో హాజరయ్యి ప్రపంచదేశాల ఫ్యాన్స్ను అబ్బురపరిచింది.
సాధారణంగా హాట్ బ్యూటీ ఊర్వశీ ఏం చేసిన అది సెన్సేషనల్ అవ్వడం గ్యారెంటీ. అది డ్యాన్స్ అయిన, చిన్న ఎక్స్ప్రెషన్ అయిన. కానీ, ఇప్పుడు ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా తాను వేసుకున్న డ్రెస్, పట్టుకున్న వస్తువు, చుట్టుకున్న తలపాగా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.
ఈ ఈవెంట్లో ఊర్వశి నీలం, ఎరుపు మరియు పసుపు రంగులలో బోల్డ్ షేడ్స్‌లో డిజైన్ చేసిన గౌను ధరించింది. అలాగే రంగురంగుల తలపాగా, చిలుక ఆకారంలో ఉన్న క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ను (బ్యాగు) పట్టుకుని వచ్చింది. పక్షి ఆకారంలో ఉన్న ఈ బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
అయితే, నెటిజన్లు ఇంటర్నెట్లో ఈ బ్యాగ్ ధర సెర్చ్ చేయగా.. 5,495 డాలర్లు (రూ 4.67 లక్షల విలువ) అని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు ఫ్యాషన్-నిపుణుడు ఇన్ స్టాగ్రామ్ పేజీ డైట్ సబ్యా వెల్లడించింది. ఈ క్లచ్ ను జుడిత్ లీబర్ చేత తయారు చేయబడింది.
Wow!#UrvashiRautela carries a crystal parrot clutch at #Cannes2025. 😍#Celebs pic.twitter.com/Mtl5MDOkRp
— Filmfare (@filmfare) May 13, 2025
ఇకపోతే, తన జుట్టు కూడా రంగురంగుల తలపాగాతో చుట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. రంగురంగుల తలపాగా జుట్టును సగం పైకి, సగం కిందకి కట్టి, ఊర్వశి మెరిసే బోల్డ్ వింగ్డ్ స్మోకీ ఐ షాడో, ముదురు కనుబొమ్మలు, నిగనిగలాడే గులాబీ రంగు లిప్ షేడ్, బుగ్గలపై బ్లష్, హైలైటర్ ఇలా ప్రతిదీ నెటిజన్లని ఫిదా అయ్యేలా చేసింది.