పెళ్లాన్ని చంపి.. బ్రెయిన్ తినేశాడు.. అడిగితే ఏమంటున్నాడో తెలుసా

పెళ్లాన్ని చంపి.. బ్రెయిన్ తినేశాడు.. అడిగితే ఏమంటున్నాడో తెలుసా

దెయ్యం ఆదేశించింది..  అందుకే  తన భార్యను ముక్కలు ముక్కలుగా చేశానని చెబుతున్నాడు ఓ నరమాంస భక్షకుడు.   మెక్సికోలో అల్వారో అనే వ్యక్తి  తన భార్యను చంపాడు. అతను ఎందుకు చంపాడో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీని కొంచెం ధైర్యం తెచ్చుకొని చదవండి. ప్రస్తుతం అల్వారా క్రైమ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 

ఆధునిక యుగంలో భార్యాభర్తల సంబంధాలు యాంత్రికంగా మారిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి అపార్థాలు, అలకలు, కోపాలు పెరిగి దాంపత్యంలో ప్రేమ భావన, ఆత్మీయత తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు హత్యల వరకు దారితీస్తున్నాయి.  ఇలాంటి ఘటనే తాజాగా మెక్సికోలో జరిగింది.  ఇదేంటి సాధారణంగా జరిగే విషయమేననుకుంటున్నారా... అరోరా అనే వ్యక్తి తన భార్యను ఎలా చంపాడో తెలుసుకుంటే నివ్వెర పోతారు. 

భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం,  విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. భార్యపై భర్తకు.. భర్తకు భార్యపై అనుమానం వచ్చిందా.. ఇక అంతే ఆ సంసారం నాశనమే.  భర్త తన భార్యను గొంతుకోసి చంపి నదిలోకి పడేశాడని.. కత్తితో పొడిచి చంపాడని..ఇలా రకరకాలు వార్తలు మీడియాలో చూస్తూనే ఉన్నాం.  ఇది కూడా అలాంటిదే అయినా ...అరోరా అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఎలా చంపాడో తెలిస్తే .. సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపిస్తుంది. .

మెక్సికో పోలీసులు అల్వారో అనే వ్యక్తిని  జూలై 2 న తన భార్యను చంపిన కేసులో అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడున్న పరిస్థితిని చూసి చలించిపోయారు.  నిందితుడు అరోరా తన భార్య మారియా మృతదేహాన్ని ఉలి , సుత్తితో ( ఫర్నీచర్ వస్తువులు తయారు చేసేవారు వాడేవి)  ముక్కలుగా నరికి వాటిని సంచిలో వేశాడు. తన భార్య  మెదడు భాగాన్ని పుచ్చకాయ మాదిరిగా కోసుకుంటూ తిని..  పుర్రెను అస్త్రంగా వాడుతున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ... శాంటా ముర్టే అనే మహిళా దెయ్యం తనను అలా చేయమని ఆదేశించిందని చెప్పాడు. నిందితుడు చెప్పిన సమాధానంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అస్థిపంజరం నమూనాలో ఉండే శాంటా ముర్టేను మెక్సికోలో పూజిస్తారు. అమెరికా, కెనడా సహా అనేక దేశాల్లో శాంటా ముర్టేకు లక్షలాది మంది భక్తులు ఉన్నారు.

అరోరా తన భార్య మారియాను చంపిన రెండు రోజులకు ఆమె తల్లికి ఫోన్ చేసి... నీ కూతురిని చంపాను మృతదేహాన్ని తీసుకెళ్లండి అని చెప్పాడు. మారియాను చంపిన తర్వాత  శరీరంలోని కొంత భాగాన్ని ఇంటి  వెనుక ఉన్న గొయ్యిలో పడేసి, మిగిలిన భాగాన్ని ప్లాస్టిక్ సంచుల్లో సర్దాడు.  అల్వారో తన భార్యను అనుమానంగా చూస్తాడని మారియా తల్లి చెప్పింది. ఆమె స్నానం చేస్తున్నప్పుడు అతను నిఘా పెట్టేవాడనీ..  తన కూతురు కొన్నాళ్లు ఈ హింసను అనుభవించిందని హతురాలు తల్లి చెప్పింది. అల్వారో భవన నిర్మాణ పనులు చేస్తుంటాడు.  మద్యం, డ్రగ్స్ కు  బానిసగా మారాడు. 

 అల్వారో తరచుగా శాంటా ముర్టే  దేవతను ఆరాధన చేస్తాడని స్థానికులు తెలిపారు.  నిందితుడి ఇంట్లో చేతబడి  చేసే బలిపీఠాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలి తల్లికి  మరియా మృతదేహాన్ని  పోలీసులు అప్పగించలేకపోయారు. ఎందుకంటే మృతురాలి అవశేషాలలో కొన్నింటి కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.  ఆ తరువాత వీటికి డీఎన్‌ఏ పరీక్ష కూడా చేయాలని పోలీసులు చెబుతున్నారు. కాని మారియా తల్లి మాత్రం తన కూతురి మృతదేహాన్ని ఇవ్వండి.. మా కుటుంబ ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతున్నారు. 

అల్వారోకు అనుమానం పెనుభూతంగా మారింది. ఆ భూతం మాయలో పడి జీవితాంతం కలసి ఉండాల్సిన భార్యను అత్యంత దారుణంగా ....పాశవికంగా హత్య చేశాడు.  భార్య బతికుండగా  చుక్కలు చూపించిన భర్త.. తన భార్య మెదడు భాగాన్ని లొట్టలేసుకుంటూ ఆరగించిన ఈ దుర్మార్గుడు చేసిన హత్య ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.