లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్

లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్

సికింద్రాబాద్: ఇంటి నిర్మాణానికి అనుమతి అడిగిన వ్యక్తిని చెప్పుతో కొట్టింది ఓ మహిళా ఆఫీసర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి తన జాగాలో ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు కోరుతూ కంటోన్మెంట్ ఆఫీస్ చుట్టూ మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నాడు. పర్మిషన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశారు కంటోన్మెంట్ అధికారులు. దీంతో… అతను కోర్టుకు వెళ్లి అనుమతి ఇచ్చేట్టుగా కంటోన్మెంట్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయినా అధికారులు స్పందించలేదు. కోర్టు అనుమతులు ఉండటంతో ఇంటి నిర్మాణానికి చెందిన పనులు మొదలు పెట్టాడు. దీంతో మంగళవారం కంటోన్మెంట్ మహిళా ఆఫీసర్ ఇల్లు కడుతున్న స్థలాన్ని పరిశీలించి.. అనుమతి లేకుండా ఇల్లు ఎలా కడతావని.. బూతులు తిడుతూ.. దశరథరామిరెడ్డిని చెప్పుతో కొట్టింది.

దశరథరామిరెడ్డి మాట్లాడుతూ… గత పదిరోజులుగా కంటోన్మెంట్ అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరిస్తున్నారనిచెప్పారు. మహిళా అధికారిని తనపై చేసిన ధాడి విషయాన్ని ఏసీబీ, సీఐడీ, పూణెలోని కంటోన్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. సదరు మహిళా అధికారిని దాడికి పాల్పడటమే కాకుండా తనపై తప్పుడు కేసులు నమోదు చేసిందని తెలిపారు.

మరిన్ని వార్తలు…

CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
సీఏఏ నిరసనల్లో పాక్ ఏజెంట్లు
ప్రపంచం అంతానికి ఇంకా 100 సెకన్లే!
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?
మోడల్ స్కూల్​ అడ్మిషన్ల​ షెడ్యూల్ విడుదల