ప్రధాని మోడీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

ప్రధాని మోడీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

సెప్టెంబర్ 17న అమిత్ షా సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్ ప్రాంగణం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.  తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరని వేల సంఖ్యలో పోస్టర్లు అంటించారు. 20 ప్రశ్నలతో కూడిన పోస్టర్లను కంటోన్మెంట్ యువత పేరుతో అంటించారు. తెలంగాణకు మెడికల్ కాలేజ్, పసుపు బోర్డు, హైదరాబాద్ ఐటీఐఆర్ , కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ  హామీలు ఏమయ్యాయని పోస్టర్లలో ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా సహకరించారో చెప్పాలని పోస్టర్లలో డిమాండ్ చేశారు.  



దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పోస్టర్లను చించేశారు.  బీజేపీ ప్రజాదరణ చూడలేకే ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు.. సికింద్రాబాద్ మంహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యాం సుందర్ గౌడ్. చట్ట విరుద్దంగా పోస్టర్లు అంటిచారని.. దీనిపై పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు.