రంజిత్ హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష

రంజిత్ హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష

కేరళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో అలప్పుజ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 15 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం. 2024, జనవరి 30వ తేదీ ఈ మేరకు తీర్పు వచ్చింది. మరణ శిక్ష పడిన 15 మందిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), PFI కార్యకర్తలు ఉన్నారు. 

ఆర్ఎస్ఎస్ కార్యకర్త, బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ రాష్ట్ర కార్యకర్తగా ఉన్నారు రంజిత్ శ్రీనివాసన్. 2021, డిసెంబర్ 19వ తేదీన ఆయన తన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి చొరబడిన ఎస్డీపీఐ, పీఎఫ్ఐ కార్యకర్తలు.. రంజిత్ శ్రీనివాసన్ ను ఇంట్లో అత్యంత దారుణంగా కొట్టి చంపారని కోర్టు నిర్థారించింది. తల్లి, భార్య, పిల్లల ఎదుట అత్యంత దారుణంగా హత్య చేయటం అనేది క్రూరమైన నేరంగా భావించిన కోర్టు.. 15 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 

రంజిత్ శ్రీనివాసన్ హత్యకు కొన్ని గంటల ముందు.. అంటే డిసెంబర్ 18వ తేదీ రాత్రి అలప్పుజాలో SDPI.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కె.ఎస్.షా హత్య జరిగింది. ఆ హత్యకు ప్రతీకారంగానే.. బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ హత్య జరిగింది.