మా ఎమ్మెల్యేలు నలుగురికి కరోనా పాజిటివ్

మా ఎమ్మెల్యేలు నలుగురికి కరోనా పాజిటివ్

తమ అసెంబ్లీకి చెందిన మ‌రో న‌లుగురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకిందని పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన ఎమ్మెల్యేలు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. కరోనా సోకిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనాను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు.

తాజాగా కరోనా సోకిన ఎమ్మెల్యేలతో కలిపి ఆ రాష్ట్రంలో కరోనా బారినపడిన ఎమ్మెల్యేల సంఖ్య 33కు చేరింది. గురువారం క‌రోనా సోకిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ర‌ణ‌దీప్ న‌భా‌, అంగ‌ద్ సింగ్, ఆప్‌కు చెందిన అమ‌న్ ఆరోరా, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ప‌ర్మీంద‌ర్ దింద్సా ఉన్నట్లు ఆయన తెలిపారు.

For More News..

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఇంట మరో విషాదం

వేరుకాపురం పెట్టిన కొన్ని రోజులకే భార్యాభర్తల ఆత్మహత్య

సరస్సులో పడి చనిపోయిన ఇద్దరు ట్రైనీ ఆర్మీ సిబ్బంది