ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీకి జో రూట్ గుడ్‌ బై

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీకి జో రూట్ గుడ్‌ బై

ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. జో రూట్ 2017లో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. దాదాపు 5 ఏళ్ల పాటు జో రూట్‌… ఇంగ్లండ్‌ జట్టు టెస్టు కెప్టెన్‌ గా విరోచిత సేవలు అందించాడు. అయితే… కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయిన రికార్డును జో రూట్‌ నమోదు చేసుకోవడం గమనార్హం. తన ఐదేళ్ల కెప్టెన్సీ లో ఇంగ్లండ్‌కు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు.

ఇటీవలి ఆస్ట్రేలియా, కరేబియన్ జట్లతో జరిగిన టెస్ట్ సిరీసుల్లో ఇంగ్లండ్ జట్టు ఒక టెస్ట్ గెలవలేకపోయింది. దీనికి బాధ్యత వహిస్తూ తన కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇక నుంచి జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో ప్లేయర్‌ గానే కొనసాగనున్నాడు.

మరిన్ని వార్తల కోసం...

సంజీవనితో మెడికల్ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి 

‘పుష్ప’ మూవీ పాట పాడిన తమిళనాడు కలెక్టర్