సంజీవనితో మెడికల్ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి 

సంజీవనితో మెడికల్ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి 

కొవిడ్ తెచ్చిన దుర్భర పరిస్థితుల్ని అధిగమించి ఎస్ఎంటీ తమ ప్రాజెక్టు ప్రారంభించడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. పటాన్ చెరులోని సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కులో ఎస్ఎంటీ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ సంజీవనిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ప్రపంచస్థాయిలో సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కు పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుంటుందనే నమ్మకం తనకుందని అన్నారు. 2017లో పార్కు ఏర్పాటు చేసిన నాటి నుంచి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎన్నో ఉత్పత్తులు జరుగుతున్నాయని చెప్పారు. 

ప్రస్తుతం మెడికల్ ఉత్పత్తుల్లో 80శాతానికిపైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు మెడికల్ డివైజ్ పార్క్ ఉపయోగపడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా వైద్య ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధికి నాంది పలికినట్లైందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తుందన్న కేటీఆర్.. ఎస్ఎంటీ తయారు చేసే మెడికల్ డివైజ్ లు 70దేశాలకు ఎగుమతి కాబోతున్నాయని చెప్పారు.