
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. కెప్టెన్సీ ఎవరికీ జన్మహక్కు కాదన్నారు. మూడు ఐసీసీ ట్రోఫీలు, నాలుగు ఐపీఎల్ టైటిల్స్ సాధించిన మహేంద్ర సింగ్ ధోని లాంటి దిగ్గజ ఆటగాడు వ్యక్తి కెప్టెన్సీ నుంచి తప్పుని కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించాడన్నాడు. అంతేగాకుండా ఎలాంటి భేషజాలు లేకుండా ధోని కోహ్లీ కెప్టెన్సీలో ఆడాడని గుర్తు చేశాడు. ఎవరైనా దేశం కోసం ఆడటం గొప్ప అదృష్టమన్నాడు. ఎంతమంది వచ్చినా జట్టులో కోహ్లీ స్థానంలో మార్పుండదని..అతడు మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడన్నాడు. కేవలం టాస్ వేయడం, ఫీల్డర్స్ సెట్ చేయడంలో మాత్రమే తేడా అన్నాడు. కోహ్లీ తన ఆటపై దృష్టి పెట్టి టీం కోసం పరుగులు చేయాల్సిన అవసరముందన్నాడు.