తిరుమల ఘాట్ రోడ్డులో తలకిందులుగా పడిన కారు : తప్పిన ఘోర ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో తలకిందులుగా పడిన కారు : తప్పిన ఘోర ప్రమాదం

ఓం నమో వెంకటేశా.. తిరుమల ఘాట్ రోడ్డులో ఓ కారు యాక్సిడెంట్ అయ్యింది. తిరుమల కొండ పైనుంచి తిరుపతికి వస్తున్న సమయంలో.. మొదటి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కొండ పైనుంచి దిగుతున్న సమయంలో.. 2వ కిలోమీటర్ మైలురాయి దగ్గర.. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అప్పటికే వేగంగా ఉన్న కారు.. బ్రేకులు పడకపోవటంతో.. అదుపుతప్పి పక్కన ఉన్న డివైడర్లను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలోనే కారు పల్టీలు కొట్టింది. ఆ తర్వాత తలకిందులుగా పడిపోయింది. 

ప్రమాదం సమయంలో కారులో నలుగురు భక్తులు ఉన్నారు. వీళ్లందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు. స్వామివారి దర్శనం కోసం తిరుమల కొండకు వచ్చి.. తిరిగి చెన్నై వెళుతున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. 20215, నవంబర్ 24వ తేదీ ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో మొదటి ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగిన సమయంలో ముందూ..  వెనకా ఎలాంటి వాహనాలు లేకపోవటంతో ఘోర ప్రమాదం తప్పింది. 

యాక్సిడెంట్ విషయం తెలిసిన వెంటనే తిరుమల తిరుపతికి చెందిన రెస్క్యూ టీం స్పాట్ కు చేరుకుంది. ప్రమాదంలో గాయపడిన కారులోని భక్తులకు చికిత్స అందించింది. వాళ్లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని స్పష్టం చేశారు వైద్య సిబ్బంది. కారును ట్రోలింగ్ ద్వారా తిరుపతికి తరలించారు అధికారులు.