అమెరికాలో కలకలం.. జో బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు

అమెరికాలో కలకలం..  జో బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు

ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ ను ఓ ప్రైవేటు కారు ఢీ కొట్టింది.  వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆయనను అక్కడినుంచి మరో చోటుకు తరలించారు.  కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డౌన్‌టౌన్ విల్మింగ్టన్‌లోని డిసెంబర్ 17 అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. 

 అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్‌ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు వస్తుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్‌ను ఢీకొట్టింది.  

ఆ సమయంలో జిల్‌ బైడెన్‌ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్‌ వాహనానికి సమీపంలోనే ఉన్నారు. బైడెన్‌కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది.  వెంటనే అలెర్ట్ అయిన అధికారులు వారిని మరో చోటుకు తరలించారు.  ఈ  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.