పార్క్ చేసిన బైక్‌కు ఢీకొట్టి, 3 కి.మీ. ఈడ్చుకెళ్లిన కారు

పార్క్ చేసిన బైక్‌కు ఢీకొట్టి, 3 కి.మీ. ఈడ్చుకెళ్లిన కారు

అత్యంత వేగంగా వచ్చిన ఓ కారు, మోటార్ సైకిల్ ను దాదాపు 3 కి.మీ. దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని మోటార్‌సైకిల్ యజమాని తెలిపారు. ప్రమాదం సమయంలో తన బైకు పార్క్ చేయబడి ఉండడంతో తాను తృటిలో తప్పించికున్నట్టు వెల్లడించారు. అయితే కారు మొదట మోటార్ సైకిల్ ను ఢీకొట్టిందని, అ తర్వాత అది కారు కింద ఇరుక్కుపోవడంతో కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో అక్కడే ఉన్న జనం కారును ఆపడానికి ప్రయత్నించినా.. ఆ వ్యక్తి పట్టించుకోకుండా వెళ్లిపోయాడని స్పష్టం చేశారు. ఈ ఘటనలో మోను అనే బౌన్సర్ తన మోటార్‌సైకిల్ బాగా దెబ్బతిన్నదని చెప్పాడు. 

సెక్టార్ 65లో జరిగిన ఈ ఘటనలో హోండా సిటీ కారు మోటార్‌సైకిల్‌ను ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. అయితే ఘటన జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ తన వాహనాన్ని వదిలి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనదారుడి ఫిర్యాదు ఆధారంగా అతని మీద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), 427 (నష్టం కలిగించడం) కింద కారు డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు అన్నారు. ఆ తర్వాత ఫరీదాబాద్ నివాసి అయిన సుశాంత్ మెహతానే కారు డ్రైవర్ గా గుర్తించి, అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితుడు సెక్టార్ 63లో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.