గొర్ల మందపైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్లో మృతి చెందిన 16 గొర్లు

గొర్ల మందపైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్లో మృతి చెందిన 16 గొర్లు

జడ్చర్ల, వెలుగు: మందపైకి కారు దూసుకెళ్లడంతో గొర్లు చనిపోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.  వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్​ నుంచి జడ్చర్ల వైపు స్పీడ్ గా వెళ్తున్న కారు గొల్లపల్లి సమీపంలో హైవే – 44 పక్కన గొర్ల మందపైకి దూసుకెళ్లింది. ధన్వాడ మండలం యనాన్ పల్లికి చెందిన మహేశ్​16 గొర్లు స్పాట్ లో చనిపోయాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్​ సీఐ కమలాకర్​ తెలిపారు.