కిలాడీ దొంగలు: ఒకే కారును మూడు సార్లు అమ్మారు

కిలాడీ దొంగలు: ఒకే కారును మూడు సార్లు అమ్మారు

ఒకే కారును మూడు సార్లు దొంగిలించి మూడు సార్లు అమ్మేసింది ఓ దొంగలమూఠా. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. థనిగై అనే సినీ నిర్మాత తన కారుపోయిందంటూ తమిళనాడు లోని కణతూర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. జూన్ 10న కణతూర్‌లోని తన గెస్ట్‌హౌస్ బయట కారును పార్క్ చేయగా చోరీకి గురైందని తెలిపాడు.

దీంతో సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ నెంబర్ల సహాయంతో గణేష్, భారతి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిని విచారించగా… కారును తామే దొంగతనం చేశామని ఒప్పుకున్నారు. తమ ముఠాలో ఐదుగురు సభ్యులున్నట్లు తెలిపారు. అయితే…థగినై కు అమ్మిన కారును మూడుసార్లు అమ్మి మూడు సార్లు దొంగతనం చేసినట్లు తెలిపాడు గణేష్.

ముందుగా.. నవనీతకృష్ణ అనే వ్యక్తికి కారును విక్రయించి… తర్వాత దానిని దొంగిలించినట్టు చెప్పాడు. రెండోసారి అదే కారును వెల్లూరుకు చెందిన వ్యక్తికి అమ్మి…  అతడి నుంచి కూడా దొంగిలించి, థనిగైకి విక్రయించినట్టు నిందితులు తెలిపారు. కారును అమ్మేటప్పుడు.. మారుతాళాలు చేయించామని… దీంతో పాటు కారుకు జీపీఎస్ అమర్చినట్టుగా తెలిపారు. దాని ద్వారా కారు ఎక్కడుందో తెలుసుకుని దొంగతనం చేశామని గణేష్ చెప్పారు.  ప్రస్తుతం నింధితుల వద్ద 10 దొంగిలించిన కార్లు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ముఠాలోని మిగితా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.