గుండెపోటు - కార్డియాక్ అరెస్ట్ ల‌క్ష‌ణాల్లో తేడా ఏంటీ.. ఎలా గుర్తించాలి

గుండెపోటు - కార్డియాక్ అరెస్ట్ ల‌క్ష‌ణాల్లో తేడా ఏంటీ.. ఎలా గుర్తించాలి

గుండె జబ్బు అనేది కరోనరీ ఆర్టరీ వ్యాధి. కార్డియాక్ అరెస్ట్, గుండెపోటులు జీవన శైలిలో మార్పులు, వైద్యపరమైన చికిత్సలతో నివారించవచ్చు. గుండెపోటు రాగానే చాలా మందికి ఆందోళనకు గురవుతారు. దాని వల్ల కొన్నిసార్లు వారి గుండె ఆగిపోవడం కూడా జరుగుతుంది. కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు.. ఈ రెండు గుండెకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు. వీటిని ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు.  –

గుండెపోటు

గుండెపోటులను మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని పిలుస్తారు. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. సాధారణంగా ఇది గుండె కండరాలకు తీసుకువెళ్లే కరోనరీ ధమనులు మూసుకుపోయినపుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల గుండెకు రక్త సరఫరా ఆగిపోతుంది.

లక్షణాలు

  • తరచుగా ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం
  • శ్వాస ఆడకపోవడం
  • చెమట, మైకంచేయి, భుజం, మెడ, దవడ లేదా వీపుకు సంబంధించిన నొప్పులు

గుండెపోటు సమయంలో, దెబ్బతిన్న ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి మరియు గుండె కండరాలకు మరింత నష్టం జరగకుండా నిరోధించడానికి తక్షణ వైద్యం అవసరం.

కార్డియాక్ అరెస్ట్

 గుండె ఆగిపోవడం అనేది గుండె పనితీరును అకస్మాత్తుగా కోల్పోవడం. గుండె ఎలక్ట్రికల్ సర్క్యూట్ర్ సరిగ్గా పని చేయనప్పుడు ఇది జరుగుతుంది. ఈ సమయంలో ఈ అసహజ లయల సమయంలో గుండె త్వరగా, అస్థిరంగా కొట్టుకుంటుంది. తద్వారా శరీరమంతా రక్తాన్ని తగినంతగా పంప్ చేయడం గుండెకు కష్టమవుతుంది.

లక్షణాలు

  • స్పృహ కోల్పోవడం
  • శ్వాస ఆగిపోవడం
  • పల్స్ లేకపోవడం

ఆరోగ్యకరమైన గుండె లయ, ప్రసరణకు సజావుగా సాగడానికి తక్షణ వైద్య సంరక్షణ అవసరం. ఈ సమయంలో సీపీఆర్ (CPR) చేయడం, డీఫిబ్రిలేటర్ ఉపయోగించడం వంటివి చేయడం చాలా ముఖ్యం.

గాయపడిన గుండె కండరాలు క్రమరహిత హృదయ స్పందనలకు కారణమవుతాయి కాబట్టి గుండె ఆగిపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం. కానీ కార్డియాక్ అరెస్ట్ లో మాత్రం అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండా కూడా ఇది జరుగుతుంది.