రూ.79వేల ఫోన్ లాంచ్.. కానీ ప్రజలు ఫోన్‌ను తక్కువగా వాడాలి..: కంపెనీ సహ వ్యవస్థాపకుడు

రూ.79వేల ఫోన్ లాంచ్.. కానీ ప్రజలు ఫోన్‌ను తక్కువగా వాడాలి..: కంపెనీ సహ వ్యవస్థాపకుడు

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్ సహ వ్యవస్థాపకుడు కార్ల్-పీ కంపెనీ అత్యంత కాస్ట్లీ ఫోన్ లాంచ్ చేసిన తరువాత ఓ  ఆసక్తికరమైన విషయాన్నీ వెల్లడించారు. మా కంపెనీ  మా ఫోన్లకు ప్రజలు ఎక్కువగా అతుక్కుపోవాలని కోరుకోవడం లేదని అన్నారు.  అలాగే స్మార్ట్‌ఫోన్‌లు మొదట క్రియేటివిటీ  ఇంకా సామర్ధ్యాన్ని పెంచడానికి తయారు చేసారు, స్క్రిన్ స్క్రోలింగ్‌ ప్రోత్సహించడానికి కాదని  వివరించారు. 

స్మార్ట్‌ఫోన్‌లు ఒకప్పుడు పర్సనల్ కంప్యూటర్ లాగానే ఉపయోగకరమైన పరికరంలాగ ఉండేదని ప్రస్తావించారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రజలు ఫోన్‌ను దృష్టి మరల్చడం కోసం అలవాటు చేసుకున్నారని అన్నారు. తాను కూడా ఒకోసారి అలాగే  చేస్తానని ఒప్పుకుంటూ, కొన్నిసార్లు నేను ఏదైనా ఒక ముఖ్యమైన మెసేజ్‌కు సమాధానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా నా సోషల్ మీడియాలోకి వెళ్లి కొద్దిసేపు స్క్రోల్ చేస్తాను" అని అన్నారు.

నథింగ్ ఫోన్ 3  ఫీచర్లు: రూ.79,999 ధరతో వస్తున్న ఈ కొత్త ఫోన్  ప్రీమియం స్మార్ట్ ఫోన్ రంగంలోకి నథింగ్ ఇప్పటివరకు చేసిన అతిపెద్ద ముందడుగు. ఆపిల్,  శామ్‌సంగ్ నుండి వచ్చిన టాప్-ఎండ్ ఫోన్లతో నేరుగా పోటీ పడాలని చూస్తుంది. ఈ ఫోన్ అన్ని ఫీచర్లతో వస్తుంది, స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED స్క్రీన్, ట్రిపుల్ 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ఇన్ని ఫీచర్లు ఉన్నాగాని  ప్రజలు  మొబైల్ స్క్రీన్‌ను ప్రతిసారి చూసుకోకుండానే ముఖ్యమైన విషయాలతో కనెక్ట్ అయ్యేలా చూడటమే దీని ఉద్దేశ్యం అని అన్నారు.

నథింగ్ ఫోన్‌ల స్పెషాలిటీ ఏంటంటే ఫోన్ వెనుక భాగం. ఇక AI గురించి మాట్లాడుతూ నథింగ్ బ్రాండ్ సొంత భాషా తయారు చేయకపోయినా, ఫోన్‌లో AIని తెలివిగా ఎలా ఉపయోగించాలో అన్వేషిస్తున్నట్లు  తెలిపారు. స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు ఆటోమేట్ చేయడానికి ప్రజలను నిజంగా అర్థం చేసుకోగలగాలి" అని అన్నారు.

ALSO READ : 18 రోజులు అంతరిక్షంలో.. 20 వ రోజు భూమి వైపు పయనం.. శుభాంశు శుక్లా టీం యాత్ర విశేషాలు ఇవి..

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా  నథింగ్ OS 3.5తో వస్తుంది. ఇందులో ఎసెన్షియల్ స్పేస్, యూనివర్సల్ ఫోన్ సెర్చ్ వంటి AI ఆధారిత టూల్స్  ఉన్నాయి. నథింగ్ ఫోన్‌లు ఎక్కువగా ఇప్పుడు భారతదేశంలో తయారవుతున్నాయి అని, ఈ కొత్త ఫోన్ కూడా భారతదేశం నుండే అమెరికాకు ఎగుమతి అవుతుందని చెప్పారు. ఈ సంవత్సరం మా కస్టమర్ల సంఖ్య, ఆదాయం మరింత పెరుగుతుందని, అలాగే $1 బిలియన్‌కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.