స్టేషన్​ఘన్​పూర్ కాంగ్రెస్ క్యాండిడేట్​పై కేసు

స్టేషన్​ఘన్​పూర్ కాంగ్రెస్ క్యాండిడేట్​పై కేసు

ధర్మసాగర్(వేలేరు), వెలుగు: కాంగ్రెస్ పార్టీ స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే క్యాండిడేట్‌‌‌‌ సింగపురం ఇందిరపై ఎలక్షన్​ ఫ్లయింగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ టీమ్ ​పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రచారంలో భాగంగా ఇందిర బుధవారం వేలేరు మండలం మలికుదుర్ల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టుపెట్టి ఒక కవర్లో గాజులు, పసుపు కుంకుమ, జాకెట్ ముక్క పెట్టి ఇచ్చి తనకు ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు గ్రామానికి చేరుకొని మహిళలకు పంచిన కవర్లు తీసుకొని సీజ్ చేశారు. తమకు ఇచ్చిన గిఫ్ట్ కవర్లను ఎలా తీసుకుంటారని మహిళలు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల వాహనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. వెంటనే కవర్లు ఇచ్చేయాలని డిమాండ్​ చేస్తూ నిరసన తెలిపారు. 

దీంతో వేలేరు పోలీసులు వచ్చి ఫ్లయింగ్ స్కాడ్ వాహనాన్ని గ్రామం దాటించారు. అధికారులు నేరుగా వేలేరు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇందిర, తన అనుచరులైన కమ్మగాని ప్రభాకర్, బట్టు పరమేశ్, జోగు రామచంద్రు తదితరులపై ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న ఎస్సై హరిత వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు సీజ్ చేసిన వాటిలో 167 జాకెట్ ముక్కలు, 668 గాజులు, 167 ప్యాకెట్ల సోంపు ప్యాకెట్స్, 167 పసుపు,  కుంకుమ డబ్బాలు ఉన్నాయి.

ALS0 READ:నల్గొండలోనే నలుగురు సీఎం అయితరంట