నారా లోకేష్ పై కేసు నమోదు

V6 Velugu Posted on May 08, 2021

అనంతపురం: పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఘటనతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వ విప్, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డికి అంటగట్టి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగిస్తూ ఆయనపై ప్రజలలో వ్యతిరేకత ద్వేషం కలిగించేలా చేశారని.. ఆయనతోపాటు  వైసీపీ పార్టీని రాజకీయంగా నష్ట పరచడానికి కుట్రపన్నినట్లు వైసీపీ ఎస్టీ సెల్ నాయకుడు భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టారని చేసిన ఫిర్యాదు ఆధారంగా నారా లోకేష్ గారి పై డి.హిరేహాళ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్:111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(A),505 మరియు 506గా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
 

Tagged Anantapur District, ap today, , anantapur today, anantapur police cases, case on nara lokesh, tdp leader naralokesh, police case on nara lokesh

Latest Videos

Subscribe Now

More News