హాస్యనటుడు సెంథిల్‌పై కేసు నమోదు

హాస్యనటుడు సెంథిల్‌పై కేసు నమోదు

తమిళ సినీ హాస్యనటుడు సెంథిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తేని పార్లమెంట్‌ స్థానానికి అన్నా మక్కళ్‌ మున్నేట్ర కళగం పార్టీ తరఫున తంగ తమిళ్‌ సెల్వన్‌ పోటీ చేస్తున్నారు. సెల్వన్‌కు మద్దతుగా నటుడు సెంథిల్ ప్రచారం చేపట్టారు. మంగళవారం సెంథిల్‌కు పోడి టీవీకేకే ప్రధాన రోడ్డులో ప్రచారం చేయడానికి పోలీసులు అనుమతినివ్వలేదు. అయినా ఆయన ప్రచార వ్యానును ఆ ప్రాంతంలో నిలిపి ప్రచారం నిర్వహించారు. దీంతో ఆ ప్రాతంలోని ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఉదయకుమార్‌ పోడి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సెంథిల్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో సెంథిల్‌ తో పాటు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.