
రామచంద్రాపురం, వెలుగు: పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై మంగళవారం బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరిశ్రమ మేనేజ్మెం ట్ నిర్లక్ష్యంతోనే 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును పెట్టారు. బీఎన్ఎస్105, 110,117 సెక్షన్ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బీడీఎల్పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.