మీర్‌‌‌‌పేట్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో మహిళలపై కేసు నమోదు

మీర్‌‌‌‌పేట్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో మహిళలపై కేసు నమోదు

ఎల్బీ నగర్, వెలుగు: ఇటీవల జరిగిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌‌‌‌ మీటింగ్‌‌కు రాకపోతే రూ.500 ఫైన్‌‌ పడుతుందని వాట్సాప్‌‌ గ్రూపుల్లో పోస్ట్‌‌ చేసిన ఇద్దరు మహిళలపై కేసు నమోదైంది. జిల్లాలోని కొంగరకలాన్‌‌లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌‌ కాంప్లెక్స్‌‌ను ఈ నెల 25న సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే సభ ఏర్పాటు చేశారు. దీనికి డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా హాజరుకావాలని, లేకపోతే రూ.500 ఫైన్‌‌ను బడంగ్‌‌పేట్‌‌ కార్పొరేషన్‌‌ కమిషనర్‌‌ కృష్ణమోహన్‌‌ రెడ్డికి కట్టాలని పద్మ, కవితా రెడ్డి అనే మహిళలు వాట్సాప్‌‌ గ్రూపుల్లో పోస్ట్‌‌ చేశారు. ఈ విషయం కమిషనర్‌‌‌‌కు తెలియడంతో ఆయన ఈ నెల 26న మీర్‌‌‌‌పేట్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఆ మహిళలపై ఫిర్యాదు చేశారు. మంగళవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.